మరో సీనియర్‌ హీరో సినిమాకి సైన్ చేసిన టాలీవుడ్‌ చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుందో లేదో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు.కానీ కాజల్ తల్లి అయిన తర్వాత కూడా వరుసగా హీరోయిన్ పాత్రలకు ఎంపిక అవుతుంది.

 Kajal Agarwal Doing One More Film With Nagarjuna, Kajal Agarwal , Indian 2 , Kam-TeluguStop.com

ఇప్పటికే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కి జోడిగా శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయింది అనే ప్రచారం జరుగుతోంది.

అతి త్వరలోనే కాజల్ షూటింగ్ లో బాలకృష్ణ తో కలిసి పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.

Telugu Balakrishna, Indian, Kajal Agarwal, Kamal Haasan, Nagarjuna, Nbk, Tollywo

ఇదే సమయం లో మరో సీనియర్ హీరో నాగార్జున కి జోడి గా కూడా కాజల్ అగర్వాల్ నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో నాగార్జున హీరో గా ఒక సినిమా రూపొందిపోతుంది.ఆ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు.

Telugu Balakrishna, Indian, Kajal Agarwal, Kamal Haasan, Nagarjuna, Nbk, Tollywo

కానీ ఆ మధ్య సీతారామం హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది.తాజాగా అదే సినిమా లో కాజల్ అగర్వాల్ కూడా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.నాగార్జున సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్ విషయం.

ఇప్పుడు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఆ సినిమా లో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube