1.రేవంత్ రెడ్డి పై షర్మిల కామెంట్స్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని వాళ్ళ పార్టీ వాళ్లే అంటున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
2.ఏపీలో బీజేపీదే అధికారం : వీర్రాజు
2024లో మోడీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
3.సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
4.నేడు నంద్యాల కు పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఏటిలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.దర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు లక్ష చెక్కు న అందిస్తున్నారు.
5.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
రాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
7.తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మేము చిన్నప్పుడు చాలా మంది అనుమాన పడ్డారు అని, అనుభవం లేదని విమర్శలు వచ్చాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
8.ఎంపీ అరవింద్ నివాసం ముందు రైతుల నిరసన
బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాట తప్పారని నిరసిస్తూ పసుపు రైతులు ఆయన నివాసం ముందు పసుపు కుప్పలు వేసి నిరసన తెలిపారు.
9.గంగా తల్లులకు ఆరోగ్య పరీక్షలు
మదర్స్ డే సందర్భంగా సెంచరీ ఆసుపత్రిలో తల్లులకు వారం రోజుల పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
10.షర్మిల కామెంట్స్
కెసిఆర్ మాటతో నష్టపోయిన రైతులందరికీ టిఆర్ఎస్ నిధి నుంచి పరిహారం ఇవ్వాలని తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
11.బొజ్జల పాడె మోసిన చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా బొజ్జల పాడె ను చంద్రబాబు మోశారు.
12.టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా ధర్మారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఇంచార్జి ఈవో గా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
13.చిన వెంకన్న ఆలయంలో మహిళా ఉద్యోగిని సస్పెండ్
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మహిళా ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు.గత నెలలో డొనేషన్ కౌంటర్ వద్ద నిత్య అన్నదాన పథకానికి ఓ భక్తుడు 1116 చెల్లించారు.అతనికి మహిళా ఉద్యోగిని 216 రసీదు చేసి పెన్నుతో 1116 రసీదు ఇచ్చారు దీనిపై విచారణ చేసిన అధికారులు పాల్గొన్న టు గుర్తించి సస్పెండ్ చేశారు.
14.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్మెంట్ లలో వేచి ఉన్నారు.
15.రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్
మదర్స్ డే సందర్భంగా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.‘ హ్యాపీ మదర్స్ డే మామ్.ఓ మంచి కొడుకును కాదు.కానీ ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ ” అంటూ చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
16.టీడీపీలో చేరిన వైసీపీ మద్దతుదారులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు 2000 మంది వైసీపీ మద్దతుదారులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
17.మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన జగన్
ఈ రోజు మదర్స్ డే ను పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
18.చంద్రబాబు వ్యాఖ్యలకు హోంమంత్రి కౌంటర్
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత.మంచి భవిష్యత్ ఇచ్చే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని ఆమె అన్నారు.
19.ఒక్క అవకాశం ఇవ్వండి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఒకసారి అవకాశం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ప్రజలను కోరారు.
20.ఈరోజు బంగారం ధరలు