తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు అందులో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒకరు.ప్రస్తుతం ఆయన చిరంజీవితో( Chiranjeevi ) ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా తర్వాత ఆయన నాగార్జునతో( Nagarjuna ) మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఇక నాగార్జున కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.రీసెంట్ గా వెంకటేష్( Venkatesh ) తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు భారీ కలెక్షన్స్ ను కూడా అనౌన్స్ చేయడం విశేషం…

ఇక ఈయనతో సినిమాలు చేయడానికి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుత చిరంజీవితో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత నాగార్జునతో కనక సినిమా చేసినట్లయితే సీనియర్ హీరోలందరితో సినిమా చేసిన ఏకైక ఈ జనరేషన్ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.తన సినిమాలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడిస్తూ కొత్తదనం అక్కడక్కడ కనిపించే విధంగా సీన్లని రాసుకుంటూ ఇక తన సీన్లలో కొత్తదనం లేకపోయినా రాసుకున్న ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉండేవిధంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.

మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుందాం…అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా ను పెంచడానికి తనవంతు కృషి చేయాలని కోరుకుందాం….








