ఇన్-ఎన్-ఔట్ బర్గర్( In N Out Burger ) సామ్రాజ్యానికి వారసురాలు అయిన లిన్సీ స్నైడర్( Lynsi Snyder ) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఆమె పుట్టుకతోనే కోటీశ్వరురాలు.
( Billionaire ) అయినా సరే, సక్సెస్ ఊరికే రాలేదని నిరూపించుకున్నారు.కేవలం 17 ఏళ్ల వయసులో, తన కుటుంబానికి చెందిన ఫాస్ట్-ఫుడ్ చైన్‌లో సమ్మర్ జాబ్ కోసం ఏకంగా రెండు గంటలు క్యూలో నిలబడ్డారు.
తన ఇంటి పేరు చూసి తనకు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె అనుకున్నారు.అందుకే అంత కష్టపడ్డారు.
ఇన్-ఎన్-ఔట్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా లిన్సీ తన పాత రోజుల్ని మర్చిపోలేదు.27 ఏళ్లకే ప్రెసిడెంట్ అయినా, స్టార్టింగ్‌లో బేసిక్ పనులే చేశారు.కూరగాయలు కట్ చేయడం, కస్టమర్లకు సర్వ్ చేయడం వంటి పనులు స్వయంగా చేశారు.ఆమె నిజ స్వరూపం స్టోర్ మేనేజర్‌కు మాత్రమే తెలుసు.మిగతా ఉద్యోగుల్లాగే కష్టపడి పనిచేసి గౌరవం పొందాలనుకున్నారు.కుటుంబం పేరు చెప్పుకుని ప్రత్యేక హక్కులు వద్దనుకున్నారు.

చిన్న వయసులోనే కంపెనీ బాధ్యతలు తీసుకోవడం అంత సులువు కాదని లిన్సీ అంటారు.మొదట్లో ఫార్మల్ ప్యాంట్‌సూట్‌లు వేసుకునేవారు.అలా చేస్తేనే అందరూ గౌరవిస్తారని అనుకున్నారు.కానీ రాను రాను తన నిజమైన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు.“ప్రజలు ఏమైనా జడ్జ్ చేస్తారు, కాబట్టి మీరు మీలాగే ఉండటం మంచిది” అని ఆమె ధైర్యంగా చెప్పారు.

ఇన్-ఎన్-ఔట్ కంపెనీని 1948లో లిన్సీ తాతయ్య, హ్యారీ స్నైడర్ స్థాపించారు.1976లో హ్యారీ చనిపోయాక, ఆమె అంకుల్స్ రిచ్, గై స్నైడర్ బాధ్యతలు తీసుకున్నారు.1993లో రిచ్ విమాన ప్రమాదంలో చనిపోయారు.1999లో ఆమె తండ్రి గై కూడా చనిపోయారు.అలా 17 ఏళ్లకే లిన్సీ కుటుంబ వ్యాపారానికి చివరి వారసురాలిగా మిగిలారు.
బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కంపెనీని దాదాపు రెట్టింపు చేశారు లిన్సీ.ఇన్-ఎన్-ఔట్ 400వ రెస్టారెంట్‌ను ఆమె ఆధ్వర్యంలోనే ప్రారంభించారు.కొలరాడో, ఒరెగాన్, టెక్సాస్ వంటి కొత్త రాష్ట్రాలకు విస్తరించారు.2025 నాటికి ఆమె నికర విలువ అక్షరాలా 7.3 బిలియన్ డాలర్లు.అంటే మన కరెన్సీలో లక్షల కోట్లు.
మీరు ఎక్కడి నుండి వచ్చినా కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది అని లిన్సీ స్నైడర్ జర్నీ నిరూపించింది.