నితిన్( Nithin ), వెంకీ కుడుముల( Venky Kudumula ) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’( Robin Hood Movie ) చిత్రం ఈ నెల 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు పోస్టర్స్ అన్ని సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ అందరి ఫోటోలు ఉన్నాయి నా ఫోటో మాత్రం లేదు అంటూ మాట్లాడారు.ఇలా రాజేంద్రప్రసాద్ మాట్లాడటంతో వెంటనే శ్రీ లీలా( Sreeleela ) మిమ్మల్ని చూడాలి అంటే టికెట్ కొనుక్కుని థియేటర్ కు వెళ్లాలి అంటూ చెప్పడంతో అబ్బో ఈ అమ్మాయి మా ఊర్లో తెలివైన పిల్లల మాట్లాడుతుంది అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేస్తుంటే నాకు నా పాత రోజులు అంటే నేను సినిమాలలో హీరోగా చేసే రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు.నా కెరియర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి.అందులో ఈ చిత్రం కూడా ఒకటిగా నిలిచిపోతుందని తెలిపారు.ఇటీవల కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్రస్ గా మారిపోయింది కానీ ఈ సినిమాలో అలాంటి మీనింగ్స్ ఏమీ ఉండవని, పూర్తిగా స్వచ్ఛమైన కామెడీ ఉంటుందని కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని తెలిపారు.
నేను చెప్పిన విధంగా ఈ సినిమా కనుక లేకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ రాజేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.రాజేంద్రప్రసాద్ లాంటి ఒక గొప్ప నటుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.







