తెలుగు ప్రేక్షకులకు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్( Anchor Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట తెలుగులో యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన అనసూయ ఇప్పుడు వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో+ నటిస్తూ దూసుకుపోతోంది.ప్రస్తుతం అనసూయ మంచి ఫుల్ జోష్ మీద ఉంది.
వరుసగా అవకాశాలు కూడా ఈమెకు ఉపయోగపడుతున్నాయి.

ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది మన రంగమ్మత్త( Rangammatta ).జబర్దస్త్ యాంకర్ గా విపరీతమైన పాపులారిటీని మూటగట్టుకున్న అనసూయ ఇపుడు బుల్లితెరను సైడ్ చేసి నటిగా వెండితెర మీద వెలిగిపోతోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తన మీద నెగటివ్ గా కామెంట్ చేసే వారికి ట్రోల్స్ చేసేవారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తనకూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు పంచుకుంటూ ఉంటుంది అనసూయ.

అలాగే ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ ని షేర్ చేసే అనసూయ వర్కౌట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.మామూలుగా ఈమె వర్కౌట్ అనగానే బయట జిమ్ లో చేసే వర్కౌట్స్ ఏ మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి.ఎందుకంటే అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను చాలాసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.కానీ ఈసారి జిమ్ లో అనసూయ వర్కౌట్స్ చెయ్యడం లేదు.తాజాగా తన ఇంటి టెర్రస్ పైనే యోగ, ఇంకా వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతేకాదు ఇంటి ముందు జిమ్ డ్రెస్ లోనే ముగ్గు వేస్తూ, ఆ తర్వాత డైలీ రోటీన్లో భాగంగా షూటింగ్ కి తయారవుతూ ఆ వీడియోలో కనిపించింది.








