ఇరాన్ దేశంలో బీచ్ (Beach in Iran)ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారిపోవడంతో జనాలు షాక్ తిన్నారు.వర్షం నీటితో బీచ్ మొత్తం ఎర్రగా(red) కనిపించడంతో ఇదేం వింత అని అందరూ కంగారు పడ్డారు.
‘రక్తపు వర్షం (Blood rain)’ అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొందరు ఇది చూసి అవాక్కవుతుంటే, మరికొందరు భయంతో వణికిపోతున్నారు.
అయితే, ఇది ఏదో మిస్టరీనో, లేక క్లైమేట్ ఛేంజ్ ఎఫెక్టో(Climate Change Effect) కాదు.దీని వెనుక అసలు సైన్స్ రీజన్ ఉంది.
ఫిబ్రవరి 22న ఓ టూర్ గైడ్ ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.రెడ్ సాయిల్ వల్లే బీచ్ ఇలా ఎర్రగా(red) మారిందని అతను చెప్పాడు.భారీ వర్షం పడటంతో ఎర్ర మట్టి కొట్టుకు వచ్చి బీచ్‌లో కలిసిపోయిందట.అందుకే సముద్రం కూడా కెంపు రంగులో మెరిసిపోయింది.
ఫిబ్రవరి 8న కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని, టూరిస్టులు దీన్ని చూసి ఫిదా అయిపోయారని ఆ గైడ్ చెప్పాడు.

నెటిజన్లు మాత్రం దీన్ని ఏదో ‘అంతుచిక్కని వింత’ అనుకున్నారు.కానీ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఇది నార్మల్ అని కొట్టిపారేశారు.ఇరాన్ టూరిజం బోర్డు (Iran Tourism Board)కూడా క్లారిటీ ఇచ్చింది.
మట్టిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండటం వల్లే ఈ కలర్ వచ్చిందని తేల్చి చెప్పింది.వర్షం నీటితో ఆ మట్టి కొట్టుకురావడంతోనే బీచ్ రెడ్ గా మారిందని వివరించింది.
ఇలా బీచ్ ఎర్రగా మారడం కొత్తేం కాదు.హార్ముజ్ దీవిలో ఈ రెడ్ బీచ్ ఉంది.
దీన్నే ‘రెయిన్‌బో ఐలాండ్’ అని కూడా పిలుస్తారు.ఇక్కడ మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ.
అందుకే ఈ బీచ్ ఎప్పుడూ రెడ్ కలర్‌లోనే ఉంటుంది.ఈ యూనిక్ ల్యాండ్‌స్కేప్‌ని చూడటానికి టూరిస్టులు రెగ్యులర్‌గా వస్తుంటారు.
ఇది నేచర్ క్రియేట్ చేసిన బ్యూటీ.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.జనాలు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.కొందరు ఫన్నీ మీమ్స్ వేస్తుంటే, మరికొందరు దేవుడికి కోపం వచ్చిందేమో అని భయపడుతున్నారు.“అర్థం కాని రక్తపు వాన అంటే దేవుడు సీరియస్ అయ్యాడనే కదా” అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఇది ప్రకృతి చేసే మ్యాజిక్.
ఇలాంటి వింతలు విశేషాలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కదా.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







