హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది.ఈ పౌర్ణమిని తెలుగు రాష్ట్రాలలో ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు.
అదేవిధంగా ఈ పౌర్ణమిని దేవా స్నాన పౌర్ణమి అని కూడా పిలుస్తారు.ఈ పౌర్ణమి రోజు పూరి జగన్నాథ్ ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
పూరి జగన్నాథ రథ యాత్రకు ముందుగా జరుపుకొనే ముఖ్యమైన పండుగలు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది.ఎంతో ముఖ్యమైన ఈ పండుగను జూన్ 24వ తేదీ పౌర్ణమి రోజు వేడుకగా నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని దేవా స్నాన పౌర్ణమి జరుపుకుంటారు.ఈ పండుగ రోజు పూరి ఆలయంలో తూర్పు ముఖంగా ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న స్నాన వేదికకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా చేరుకుంటాయి.
ఈ విగ్రహాలను స్నాన వేదికలో 108 సార్లు సుగంధ పరిమళాలు వెదజల్లే నీటితో విగ్రహాలకు స్నానం చేయిస్తారు.ఈ సందర్భంగా దేవతలు హాతి వేష అని పిలువబడే ఏనుగు వేషధారణలో భక్తులకు దర్శనం కల్పిస్తారు.

ప్రతి ఏడు ఇదే రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన్, మదన్మోహన్ దేవతా విగ్రహాలను పూరి జగన్నాథ్ ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి ఆలోచించు ఆ తర్వాత ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ విధంగా పూరి జగన్నాథ్ ఆలయంలో దేవతా విగ్రహాలకు పెద్ద ఎత్తున దేవా స్నాన పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తారు.ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని, రైతుల పండుగగా ఘనంగా నిర్వహించుకుంటారు.ఈ పండుగ రోజు రైతులు తమ ఎద్దులకు, నాగలికి, భూమాతకు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం.