ఢిల్లీలో సీబీఎస్సీ( CBSE ) పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి.మరోవైపు రైతుల నిరసనల( Farmers Protest ) నేపథ్యంలో ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
దీంతో విద్యార్థులు కాస్త ముందుగానే పరీక్షలకు హాజరవుతున్నారు.కాగా రైతుల ఆందోళనలతో ఇప్పటికే సీబీఎస్సీ విద్యార్థులకు( CBSE Students ) అడ్వయిజరీ జారీ చేసింది.
ఈ క్రమంలోనే విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సీబీఎస్సీ పేర్కొంది.ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా

అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న సీబీఎస్సీ ఆదేశాల మేరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు( Exam Centers ) చేరుకున్నారు.ఉదయం 10 గంటల తరువాత వచ్చిన విద్యార్థులకు సీబీఎస్సీ అనుమతి నిరాకరించింది.పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మెట్రో రైలును విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించింది.కాగా ఈ ఏడాది ఢిల్లీలో మొత్తం 877 పరీక్షా కేంద్రాలను సీబీఎస్సీ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో సుమారు 5 లక్షల 80 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.







