ఏపీ అధికార వైసీపీలో( YCP ) తిరుగుబాటు బావుటా ఎరుగురవేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.ఆ మద్య కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావ్.
( Yarlagadda Venkatrao ) ఇలా కీలక నేతలంతా వైసీపీకి షాక్ ఇస్తున్నారు.ఇక తాజాగా గన్నవరం నేత యార్లగడ్డ వెంకటరావ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
గన్నవరంలో వైసీపీ నుంచి యార్లగడ్డ టికెట్ ఆశించగా అందుకు జగన్ నిరాకరించారు.అయినప్పటికి తాను గన్నవరం నుంచి బరిలోకి దిగుతానని చెప్పడంతో ఆయన వైసీపీ విడతారనే వార్తలు గుప్పుమన్నాయి.

దాంతో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మాట్లాడుతూ.పార్టీలో ఉండేవారు ఉంటారని ఉండలేని వారు బయటకు వెళ్లొచ్చని చెప్పుకొచ్చారు.ఈ వ్యాఖ్యలు యార్లగడ్డకు గట్టిగానే తాకాయి.దాంతో పార్టీలో అవమానాలు పడుతూ తాను ఉండలేనని పార్టీ విడుతున్నట్లు ప్రకటించారు.దీంతో గన్నవరంలో( Gannavaram ) వైసీపీకి గట్టి షాక్ తగిలింది.అయితే ప్రస్తుతం యార్లగడ్డ టీడీపీలో( TDP ) చేరేందుకు మార్గం సుముఖం చేసుకున్నారు.
నేడు ( ఆగష్టు 20 ) టీడీపీ అధినేత చంద్రబాబుతో బేటీ కానున్నారాయన.ఈ భేటీ తరువాత అధికారికంగా ఆయన టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది.
అయితే యార్లగడ్డ పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీలో చేరేందుకు ఈ రకమైన రచ్చకు తెర తీశారా అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట.

గన్నవరం టికెట్ రానప్పటికి ఆయనకు పార్టీలో అధిష్టానం సరైన ప్రదాన్యత ఇచ్చే అవకాశం ఉండేదని, కానీ యార్లగడ్డ పార్టీ వీడడం వెనుక ఆయన ముందస్తు ప్రణాళిక కనిపిస్తోందని వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదంతా చంద్రబాబు( Chandrababu Naidu ) డైరెక్షన్ అని వైసీపీని దెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ వర్గం ఆరోపిస్తోంది.అయితే గన్నవరం టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పడంతోనే యార్లగడ్డ వెంకటరావ్ టీడీపీలో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.ఏది ఏమైనప్పకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీలో కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడడం ఆ పార్టీని కలవరపెట్టే అంశమే.







