నంద్యాల జిల్లా డోన్ మండలంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.మండలంలోని ఇందిరాంపల్లి, రామకొండ మరియు చనుగొండ్ల ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గొర్రెల కాపరులు గుర్తించారని తెలుస్తోంది.
చిరుత సంచారం నేపథ్యంలో గొర్రెల కాపరులతో పాటు సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారని సమాచారం.
కాగా గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్న విషయం తెలిసిందే.







