మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం.. భక్తులు లక్షల్లో వస్తారని అంచనా..

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ ఈ జాతర.

 Mini Medaram Sammakka Saralamma Jatara 2023 Begins, Sammakka Saralamma Jatara, M-TeluguStop.com

ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది.ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అసలు జాతర ఇప్పటికే పూర్తి అయిపోయింది.

ఈ నేపథ్యంలో మేడారం మీనీ జాతర నిర్వహణకు ముహూర్తం ఖరారు చేశారు.

ఫిబ్రవరి లో మినీ మేడారం జాతరను నిర్వహించే అవకాశం ఉంది.సమ్మక్క సారలమ్మ ఇష్టమైన మఘశుద్ధ పౌర్ణమి జరుపుకొని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ జాతరను నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మినీ జాతరను నిర్వహించనున్నారు.


Telugu Medaram Jatara, Medaram, Telangana, Tribal-Latest News - Telugu

ఇంకా చెప్పాలంటే ఈ జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.మినీ జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మండ మెలిగే పండుగ ఈ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తారు.తర్వాతి రోజు సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు.

మూడవ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు.

Telugu Medaram Jatara, Medaram, Telangana, Tribal-Latest News - Telugu

ఆ తర్వాత భక్తులు తమ మొక్కలను తీర్చుకునేందుకు అనుమతిని కలిగిస్తారు.ఈ మినీ మేడారం జాతరలో వన దేవతలను గద్దేలపైకి తీసుకొని రారు.మిగతా పూజా కార్యక్రమాలు యధావిదంగా జరుగుతూ ఉంటాయి.

మినీ సమ్మక్క సారలమ్మల జాతరకు మేడారంతో పాటు పునుగొండ్ల, బక్కయ్య పేట, కొండాయిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకున్నారు.

మరో వైపు మేడారం పూజారుల మధ్య వాటాల విషయంలో నెలకొన్న మనస్పర్ధలను పరిష్కరించుకునేందుకు దేవాలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మనస్పర్దాలు పరిష్కరించుకుంటే మేడారం జాతర మొదలైపోయినట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube