Maha Shivaratri : మహా శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని శివపూజ భజన లీలా, శ్రవణా దులతో మేల్కొల్పి తను శివుడై, సర్వం శివ స్వరూపంగా భావించి దర్శించడమే నిజమైన జాగరణమని పండితులు చెబుతున్నారు.అయితే ఇలా చేయడం ఇలా చేస్తే, శివపూజలో( Shivapooja ) సాయు జ్యం, శివభజనలో సామీప్యం, శివభక్తులతో కూడి, శివ విషయాలు ప్రసంగించుటలో సలోక్యం, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని సాక్షాత్తు జగద్దురువు ఆదిశంకరాచార్యులు( Jagadguru Adishankaracharya ) వారు తెలిపారు.

 Why Dont We Sleep On Mahashivaratri Night-TeluguStop.com

అలాగే కడుపులో విషతుల్యమైన ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.అవి శరీరారోగ్యం పై ప్రభావం చూపించకుండా ఉండడానికి ఉపవాసం చేసిన వారికి జాగరణ కూడా చాలా ముఖ్యమైనది అని తెలిపారు.

అయితే మర్నాడు మిగతాహారంతో ఉపవాసం( Fasting ) విరమించిన తర్వాత కూడా వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు.రెండు పుటలైన ఆహారం( Food ) కచ్చితంగా తీసుకోవాలి.అంతేకాకుండా జాగరణమంటే మన గురించి మనం మేలుకొని( Awake ) ఉండడం అని అర్థం.అయితే జాగరణను సంపూర్ణ ఆరోగ్యవంతులే కచ్చితంగా చేయాలి.జాగరణ మర్నాడు విశ్రాంతిగా గడపడం చాలా అవసరం అని చెప్పవచ్చు.ఎందుకంటే జాగరణ సమయంలో కనీసం ఒక్క నిమిషము కూడా నిద్రపోకూడదు.

అలాగే శరీరం నిద్ర లేక ఎంతగానో అలసిపోయి ఉంటుంది.కాబట్టి ఈ జాగరణ మర్నాడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.అంతేకాకుండా ఉపవాస జాగరణలు చేసే వారు మితి మీరిన శారీరక శ్రమకు కూడా దూరంగా ఉండాలి.అంతే కాకుండా డ్రైవింగ్ లాంటి ఏకాగ్రత కూడా అత్యవసరం అయ్యే పనులకు కూడా విశ్రాంతి తర్వాతి ఉపక్రమించాలి.

ఇక జాగరణ సమయంలో మానసిక ఉద్వేగాలనిపించే వినోద కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube