వైరల్: అధికవేగం ఎప్పుడైనా ప్రమాదకరమే... ట్రాన్స్ ఫార్మర్ లోకి చొచ్చుకుపోయిన బైకర్!

అవును, అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే.నిదాన‌మే ప్రధానం అన్నారు పెద్దలు.

 Viral Biker Penetrating Into A Transformer In Kerala Details, Tranformer, Viral-TeluguStop.com

కానీ నేటి యువత అలాంటి మాటలను పెడచెవిన పెడుతోంది.ఓ వైపు పోలీసులు, ట్రాఫిక్, RTA అధికారులు ప్ర‌జ‌ల‌కు ఎన్ని అవగాహ‌న కార్య‌క్ర‌మాలు కల్పిస్తున్నప్పటికీ కొంతమంది ప్రబుద్ధులు మారడంలేదు.వాహ‌నాల‌ను రోడ్లమీద కాకుండా గాలిలో నడుపుతున్నారు.దాంతో ప్రాణాల మీద‌కి తెచ్చుకుంటున్నారు.అతివేగం వ‌ల్ల జ‌రిగిన ప్ర‌మాదాల‌ను మ‌నం త‌ర‌చూ ఎన్నో చూస్తుంటాం.అయితే ఇక్కడ కూడా అలాంటి పెనుప్రమాదమే జరగాల్సి వుంది.

అదృష్టం కలిసిరావడం వలన తృటిలో తప్పించుకున్నాడు.

కేరళ రాష్ట్రంలో జరిగిన సంఘటన తాజాగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే, ఇడుక్కిలోని వెల్లయంకుడి ప్రాంతంలో విష్ణు ప్ర‌సాద్ అనే యువ‌కుడు బైక్ పై అతి పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై దూసుకువెళ్తున్నాడు.దాంతో ఒక్క‌సారిగా ఆ బైక్ అదుపుత‌ప్పి, ప‌ల్టీలు కొట్టింది.

సరాసరి అలా గాలీలో లేస్తూ ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మ‌ర్ కంచెలో ప‌డిపోయింది.ఈ యువ‌కుడు కూడా రోడ్డు వెంట పొర్లుతూ ట్రాన్స్ ఫార్మ‌ర్ కు కొంచెం దూరంలో వెళ్లి ఆగిపోయాడు.

అంత పెద్ద ప్ర‌మాదం నుంచి అత‌డు సుర‌క్షితంగా భ‌య‌ట‌ప‌డ్డాడు.ఇదంతా క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది.

Telugu Bike Dash, Biker, Bikervishnu, Helmet, Kerala, Speed, Road, Stuns, Latest

కాగా ఈ ప్ర‌మాదం అక్క‌డున్న CC కెమెరాల్లో రికార్డ్ కాగా, ఈ తీరుని చూసిన జనాలు అచ్చం సినిమాల్లో హీరోలు చేసే స్టంట్ లాగా క‌నిపించిందని చెప్తున్నారు.ఇకపోతే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఆ యువ‌కుడు క‌నీసం హెల్మెట్ కూడా ధరించకపోవడం బాధాకరం. పోలీస్ అధికారులు వాహనదారులని హెల్మెట్ ధరించమని పదేపదే చెప్తున్నా వినకపోవడం దురదృష్టకరం.ఈ ప్ర‌మాదం విష‌యం తెలుసుకున్న అధికారులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు.క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేసి బైక్ ను బ‌య‌ట‌కు తీశారు.బైకర్ పైన కేసు నమోదు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube