గ్రీన్ టీ.దీని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానియాల్లో గ్రీన్ టీ కూడా ఒకటి అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా బరువు తగ్గి.
ఫిట్‌గా మారాలనుకునే వారు ఖచ్చితంగా తమ డైలీ డైట్‌లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.కేవలం బరువు తగ్గించడంలోనే కాదు.
మెదడును చురుగ్గా ఉంచడంలోనూ, మధుమేహాన్ని అదుపు చేయడంలోనూ, శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ ఇలా అనేక విధాలుగా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
అయితే ఆరోగ్యానికి మంచిదని కొందరు గ్రీన్ టీని అతిగా తాగేస్తుంటారు.
కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.
ఓవర్‌గా తాగితే అనేక జబ్బులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా రోజుకు రెండు కప్పుల మించి గ్రీన్ టీని సేవిస్తే.
శరీరంలో ఐరన్ లోపం ఏర్పుడుతుంది.దాంతో రక్త హీనత సమస్య బారిన పడతారు.
![Telugu Green Tea, Tips, Heart, Latest, Pressure, Effects-Telugu Health - తె Telugu Green Tea, Tips, Heart, Latest, Pressure, Effects-Telugu Health - తె](https://telugustop.com/wp-content/uploads/2021/04/side-effects-of-drinking-the-green-tea-too-much.jpg )
అలాగే గ్రీన్ టీని అతిగా తీసుకోవడం వల్ల రక్త పోటు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.మరియు హార్ట్ బీట్ రేట్ కూడా పెరిగిపోతుంది.నిత్యం రెండు కప్పులకు మించి గ్రీన్ టీని తీసుకుంటే.అందులో ఉండే కెఫీన్ కారణంగా నిద్ర లేమి బారిన పడే ప్రమాదం ఉంటుంది.ఇక ఈ నిద్ర లేమి దెబ్బకు నీరసం, తరచూ అలసట, చికాకు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అలాగే గ్రీన్ టీని అధికంగా తీసుకుంటే శరీరంలో హార్మోన్ల పని తీరులో దెబ్బ తింటుంది.
దాంతో అనేక హార్మోన్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఓవర్‌గా గ్రీన్ టీని తాగడం వల్ల.అందులో ఉండే కెఫీన్ జీర్ణక్రియపై ప్రభావం చూపి.పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది.
ఫలితంగా శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది.అందువల్ల, గ్రీన్ టీను అతిగా తీసుకునే అలవాటుకు ఇకపై చెక్ పెట్టండి.
.