వరి బియ్యం నుంచి తయారు చేసే వాటిలో మరమరాలు ఒకటి.మరమరాలను కొందరు డైరెక్ట్‌గా తింటారు.అలాగే రకరకాల వంటలు కూడా చేస్తారు.ఛాట్, ఉప్మ, లడ్డూ, దోస ఇలా ఎన్నో చేస్తుంటారు.అయితే మరమరాలతో ఏ వంటకం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.మరమరాల్లో బోలెడన్ని పోషక విలువలూ దాగి ఉంటాయి.
అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ఆకలి ఆకలి అని తరచూ మారం చేసే పిల్లలకు మరమరాలు బెస్ట్ స్నాక్స్ అని చెప్పుకోవచ్చు.
మరమరాలను డైరెక్ట్‌గా పెట్టడం లేదా వాటితో పాయసం, ఛాట్, లడ్డూలు వంటివి చేసి పెట్టడం చేస్తే వాళ్లు ఎంతో ఇష్టంగా తింటారు.పైగా మరమరాల్లో ఉండే పోషక విలువల మీ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పతాయి.
పిల్లల్లో రక్త హీనత సమస్య చాలా కామన్‌గా కనిపిస్తుంటుంది.అలాంటి వారి డైట్‌లో మరమరాలను చేర్చడం ఎంతో ఉత్తమం.
మరమరాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అందు వల్ల, వీటిని పిల్లలకు పెడితే రక్త వృద్ధి జరుగుతుంది.
రక్త హీనత తగ్గు ముఖం పడుతుంది.
పిల్లల రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ప్రోటీన్ ఎంతో అవసరం.అయితే మరమరాల్లోనూ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది.కాబట్టి, ఉదయం బ్రేక్ పాస్ట్‌లో మరమరాలతో తయారు చేసిన రెసిపీలను పిల్లలకు పెడితేనీరసం, అలసట వంటి సమస్యలు దూరమై శక్తివంతంగా మారుతారు.
అలాగే పిల్లల డైట్‌లో మరమరాలను చేర్చడం వల్ల వారి మెదడు చురుగ్గా మారుతుంది.జ్ఞాపక శక్తి సైతం రెట్టింపు అవుతుంది.
ఇక పిల్లలే కాదు.పెద్దలు సైతం మరమరాలను తీసుకోవచ్చు.
మరమరాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.అధిక రక్త పోటు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యం పెరుగుతుంది.మరియు బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకుంటే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.