వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి.కొంత మంది మామిడి పండ్లను కృతిమంగా పండిస్తూ ఉంటారు.
అయితే కొంత మంది మామిడి కాయలను మందు పెట్టి పండిస్తూ ఉంటారు.అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు.
అయితే మార్కెట్లో క్యాల్షియం కార్బైడ్ ఉపయోగించిన వాటితో పాటు సహజసిద్ధంగా పండించినవీ అమ్ముతారు వాటిని ఈ విధంగా గుర్తించాలి.వాటిని తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అయితే కృతిమ పండ్లను ఎలా గుర్తించాలో ఒక్కసారి చూద్దామా.
కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు మంచి రంగులో కనిపిస్తాయి.
అయితే మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పసుపు రంగులోనే ఉన్నపటికీ వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి.సహజసిద్ధంగా పక్వానికి వచ్చిన పండైతే దాని రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది.
ఇక సాధారణంగా సహజమైన రీతిలో పండిన మామిడి నుంచి వచ్చే వాసన మధురంగా అనిపిస్తుంది.కానీ కార్బైడ్ ఉపయోగించి పండబెట్టిన మామిడపండ్ల నుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో వాటి నుంచి ఎలాంటి వాసన రాకపోవడం మనం గుర్తించుకోవాలి.

అయితే కృత్రిమంగా మగ్గబెట్టిన పండును తింటున్నప్పుడు నోటిలో, గొంతులో మంటగా అనిపిస్తుంది.అలాంటి పండ్లను తిన్న కొద్దిసేపటికి కడుపునొప్పి, డయేరియా వంటివి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.అదే సాధారణంగా పండించిన పండ్ల రుచి అద్భుతంగా ఉంటుంది.
అంతేకాదు సహజంగా పండిన మామిడి పండ్ల గుజ్జు కాస్త ఎరుపు కలిసిన పసుపు రంగులో ఉంటుంది.కృతిమంగా పండిన పండ్లలో గుజ్జు లేత లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది.
ఇక మామిడి జ్యూస్ తీస్తున్నప్పుడు రసం చాలా తక్కువ మోతాదులోవస్తే అయితే అది కృత్రిమంగా మగ్గబెట్టిన పండే.అలా కాకుండా పూర్తిగా పక్వానికి వచ్చి సహజసిద్ధమైన రీతిలో మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది.
పైగా తియ్యగా కూడా ఉంటుంది.వీటి ద్వారా కృతిమ పండుకు, సహజంగా పండించిన పండును గుర్తించవచ్చు.