కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీలో (San Diego County, California)సోమవారం ఉదయం 5.2 తీవ్రతతో ఒక పెద్ద భూకంపం వచ్చింది.జూలియన్ దగ్గర సంభవించిన ఈ భూకంపం ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా వచ్చింది.దీని దెబ్బకి దక్షిణ కాలిఫోర్నియా(California) మొత్తం అదిరిపోయింది.దాదాపు 120 మైళ్ల దూరంలో ఉన్న లాస్ ఏంజిల్స్ వరకు కూడా దీని ప్రభావం కనిపించింది.శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ సిస్టమ్‌లో భాగమైన ఎల్సినోర్ ఫాల్ట్ జోన్ దగ్గర ఈ భూకంపం మొదలైంది.
భూకంపం(Earthquake) వచ్చిన వెంటనే శాన్ డియాగో జూ సఫారి పార్క్‌లో (San Diego Zoo Safari Park)జరిగిన ఒక వింతైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అక్కడ ఉన్న ఏనుగులు భూమి కంపించగానే వెంటనే ఒక ప్రత్యేకమైన రీతిలో స్పందించాయి.
వాటి గుంపులోని పిల్ల ఏనుగుల్ని చుట్టుముట్టి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి.దీన్నే “అలర్ట్ సర్కిల్”(“Alert Circle”) అంటారు.
ఏనుగులు తమ పిల్లల్ని, బలహీనంగా ఉన్నవాటిని కాపాడుకోవడానికి సహజంగా చేసే రక్షణ చర్య ఇది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శాన్ డియాగో జూ వైల్డ్‌లైఫ్ అలయన్స్ (SDZWA) ప్రకారం ఏనుగులు భూకంపాల్ని(Earthquake) గాలి ద్వారానే కాదు, భూమిలో వచ్చే ప్రకంపనల్ని వాటి పాదాల ద్వారా కూడా పసిగట్టగలవు.అందుకే అవి అంత త్వరగా స్పందించగలిగాయి.“ఏనుగులు వాటి పాదాల ద్వారా శబ్దాలను, ప్రకంపనలను గుర్తించగలవు.ఈ వీడియో ఏనుగుల గుంపులో కుటుంబ బంధాలు ఎంత బలంగా ఉంటాయో చూపిస్తుంది” అని SDZWA సంస్థ తెలిపింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఏనుగుల రక్షణ చర్యకు ముగ్ధులయ్యారు.“వాటిని మనం రక్షించాలి.ఎంత గొప్పగా, అందంగా, తెలివిగా ఉన్నాయో చూడండి” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఏనుగులు నిజంగా అద్భుతమైన జీవులు” అని మరొకరు పొగిడారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.భూకంపం ప్రభావం వల్ల శాన్ డియాగో నగరంలో కొన్ని చోట్ల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.రామోనా, పైన్ వ్యాలీ, క్యూయమాకా రాంచో స్టేట్ పార్క్ వంటి ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.ఉదయం 11:30 గంటల వరకు 3.0 నుంచి 3.9 మధ్య తీవ్రతతో నాలుగు ఆఫ్టర్‌షాక్స్ వచ్చాయి.అయితే అదృష్టవశాత్తూ ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.