తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) లాంటి నటుడు సైతం తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి ఒకప్పుడు మాత్రం ఆయన చేసిన ప్రతి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ పోటీని వస్తూ వచ్చాడు.

మరి ఇప్పుడు ఆయన సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.మరి ఆయన ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఎలాంటి జానర్ లో చేస్తాడు.తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు వస్తుంది ఆయన చేయబోతున్న సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పించ గలుగుతాడు అనేది తెలియాల్సి ఉంది.
సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ భారీ క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆయనతో పోటీపడే హీరోలు ఇంకెవరు లేరనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న స్టార్ హీరోలందరికంటే కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో ఒక సినిమా చేసి సినిమాను చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా ఒక పొలిటికల్ డ్రామాగా ఉండబోతుందట.మరి ఇలాంటి జానర్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమా చేయలేదు మరి ఈ సినిమాతో ఆయన ఎలా మెప్పిస్తాడు ప్రేక్షకులందరిని అలరించే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.