శ్రీదేవి బయోపిక్ లో పూజా హెగ్డే.. ఆమె రియాక్షన్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే( Heroine Pooja Hegde ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా.

 Pooja Hegde React On Sridevi Biopic And Retro Movie, Pooja Hegde, Sri Devi, Sri-TeluguStop.com

ముఖ్యంగా ప్రభాస్ ,అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు ( Prabhas, Allu Arjun, Jr.NTR, Mahesh Babu )లాంటి హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.అయితే పూజా హెగ్డే తెలుగు సినిమాలలో నటించి దాదాపు మూడేళ్లు అవుతోంది.ప్రభాస్ తో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలో కూడా నటించింది.తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం హిందీ తమిళ సినిమాలలో బిజీబిజీగా ఉంది.

Telugu Pooja Hegde, Poojahegde, Sri Devi, Sri Devi Biopic, Tollywood-Movie

ఇకపోతే త్వరలోనే ఈమె రెట్రో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.సూర్య హీరోగా కార్తిక్‌ సుబ్బరాజు ( Karthik Subbaraju )తెరకెక్కించిన ఈ తమిళ్‌ మూవీ మే 1న విడుదల కానుంది.ఈ సందర్భంగా పూజ ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా సంగతులు పంచుకున్నారు.శ్రీదేవి బయోపిక్‌ పై కూడా స్పందించారు.ఒకవేళ శ్రీదేవి బయోపిక్‌ ఖరారైతే.అందులో నటిస్తారా? అని అడగ్గా.ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మలో నటించానని నవ్వుతూ చెప్పారు.ఆ అవకాశం వస్తే తప్పక నటిస్తానని ఆమె అన్నారు.ఎవరి బయోపిక్‌లో నైనా నటించడం తనకు ఇష్టమేనని అన్నారు.

Telugu Pooja Hegde, Poojahegde, Sri Devi, Sri Devi Biopic, Tollywood-Movie

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ చేసేందుకూ సిద్ధమని అన్నారు పూజా.ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను.త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

తర్వాత రెట్రో గురించి మాట్లాడుతూ.ఈ సినిమాలో 15 నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని తాను, సూర్య సింగిల్‌ టేక్‌ లో పూర్తి చేసినట్టు వెల్లడించారు.

అది యాక్షన్‌, డ్యాన్స్‌ మిళితమైన సీన్‌ అన్నారు.సుమారు మూడు రోజులు రిహార్సల్స్‌ చేశానని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube