నేటి వాతావరణ పరిస్థితుల్లో వెంట్రుకలు రాలిపోయే సమస్యను చాల మంది ఎదురుకుంటున్నారు.అదే కాకుండా జుట్టు తెల్లబడటం మరియు చుండ్రు లాటి సమస్యలు కూడా ఉన్నాయి.
దీని వలన తల వెంట్రుకలను సంరక్షించుకోవటం చాలా ఇబ్బంది గా ఉంది.ఈ యొక్క సమస్యను పరిష్కరించటాని మనకు మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి
ముందుగా మెంతుల పేస్ట్ ని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
వేడి కొబ్బరి నూనెలో ఒక రాత్రంతా మెంతులు నానబెట్టి ఉదయాన్నే అయొక్క మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ ల చేసుకోవాలి.ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించి ఒక 30 నిమిషాలపాటు అలానే ఉంచాలి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.దీని వల్ల జుట్టు సమస్యలన్నీ తొలిగిపోతాయి.
చుండ్రు సమస్య త్వరగా తగ్గాలి అంటే కొబ్బరి నూనె బదులు గా పెరుగు వాడితే మంచి ఫలితం ఉంటుంది.అదే విధంగా మెంతులు మరియు మందార పువ్వులు మెత్తగా పొడి చేసి ఆ యొక్క పొడిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.
దీని వలన జుట్టు రాలె సమస్య తో పాటు ఇతర జుట్టు సంబంధ సమస్యలు కూడా పరిస్కారం దొరుకుతుంది