సాధారణంగా కొందరికి శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది ముఖం మాత్రం నల్లగా ఉంటుంది.ఇలాంటి వారు చాలా బాధ పడుతుంటారు.
ముఖం నలుపును తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు వాడతారు.
తరచూ బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు తగలేస్తుంటారు.కానీ, కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.
మరి ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కీరదోస నుంచి తీసుకుని రసం, ఎగ్ వైట్, మొక్క జొన్న పిండి మరియు నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం తెల్లగా మారియు ఫ్రెష్‌గా మారుతుంది.
అలాగే ముఖాన్ని తెల్లగా మార్చడంలో ఓట్స్ కూడా గ్రేట్‌గా సహాయపడతాయి.ఒక బౌల్‌లో ఓట్స్ పొడి, ఆలివ్ ఆయిల్ మరియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమానికి ముఖానికి కావాలనుకుంటే మెడకు కూడా అప్లే చేసి అర గంట పాటు వదిలేయాలి.
ఆ తర్వాత కోల్డ్ వాటర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముఖం తెల్లగా మరియు కాంతివంతంగా తయారవుతుంది.
ఇక ఒక బౌల్‌లో పాల పొడి, పెరుగు మరియు స్వచ్ఛమైన రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా ముఖం తెల్లగా, మృదువుగా మారుతుంది.