పెర్త్ ఫాస్ట్ వికెట్‌పై ఆస్ట్రేలియా( Australia ) ఫాస్ట్ బౌలర్ల ధాటికి టీమ్ ఇండియా( Team India ) తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్( Josh Hazlewood ) నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా నడ్డి విరిచాడు.దీంతో పాటు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.
టీమిండియా తరుపున భారత్ తరఫున అరంగేట్రం ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి( Nitish Kumar Reddy ) అత్యధికంగా 41 పరుగులు చేశాడు.తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరారు.
ఇక నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఐదు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.జోష్ హేజిల్‌వుడ్ విరాట్‌ను ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అవుట్ చేశాడు.కెప్టెన్ రోహిత్ శర్మ( Captain Rohit Sharma ) గైర్హాజరీలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు వచ్చిన కేఎల్ రాహుల్( KL Rahul ) 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆ తర్వాత ధ్రువ్ జురెల్ 11 పరుగులు, వాషింగ్టన్ సుందర్ నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు.73 పరుగులకే 6 వికెట్లు పతనమైన తర్వాత రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డిలు ఇన్నింగ్స్ ను కాస్త గట్టెకించారు.వీరిద్దరూ ఏడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
78 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు.ఇక మరోవైపు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒకవైపు గట్టిగా నిలబడ్డాడు.కానీ, అతనికి ఎవరూ మద్దతు ఇవ్వలేదు.
అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు.ఈ సమయంలో నితీష్ 6 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.
మరో ఎండ్‌లో హర్షిత్ రాణా 7 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు.తొలి టెస్టు ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి అద్భుత షాట్లో సిక్సర్ కొట్టాడు.
ఏ ఆటగాడు అతనికి మద్దతు ఇవ్వకపోవడంతో, అతను వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవుట్ అయ్యాడు.నితీష్ రూపంలో భారత్ చివరి వికెట్ కోల్పోయింది.
దింతో 150 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది.