హెల్త్‌ టిప్స్‌ : రెగ్యులర్‌గా తల స్నానం చేయడం మంచిదేనా? ఆడవారి జుట్టు సమస్యలకు అద్బుత పరిష్కారాలు

పెరిగిన కాలుష్యం కారణంగా భారీ ఎత్తున జట్టు ఊడిపోవడం అనేది చాలా కామన్‌ అయ్యింది.బట్టతల అనేది వంశ పారంపర్యంగా వస్తుందంటారు.

 Health Tips, Hair Care, Hair Tips, Home Remedies For Beautiful Hair-TeluguStop.com

కాని ఇప్పుడు కాలుష్యం మరియు ఇతరత్ర కారణాల వల్ల జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చేస్తుంది.చిన్న పెద్దా అనే తేడా లేకుండా జుట్టు రాలిపోవడం అనేది పెద్ద సమస్యగా దాపరించింది.

జుట్టు విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాలిపోవడం ఆపేయవచ్చు అంటూ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మార్కెట్‌లో లభించే పలు రకాల హెయిర్‌ షాంపులను వాటం వల్ల అత్యధిక నష్టం వాటిల్లుతుందని పెద్దలు చెబుతున్నారు.

జుట్టు రాలే సమస్యలకు ఇంట్లో వస్తువులు పదార్థాలతో చెక్‌ పెట్టవచ్చు.పూర్తిగా కాకున్నా ఒక మోస్తరు జుట్టు సంరక్షణకు ఈ టిప్స్‌ పని చేస్తాయి.జుట్టు రాలే సమస్యకు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జుట్టు ఎప్పుడు జిడ్డుగా ఉండే వారు రెగ్యులర్‌గా తల స్నానం చేయడం మంచిది కాదు.

జిడ్డు జుట్టుకు షాంపులను పెట్టడం వల్ల జుట్టు అనారోగ్యం మారుతుంది.అందుకే రెగ్యులర్‌గా తల స్నానం చేయకుండా వారంలో ఒకసారి లేదంటే రెండు వారాలకు ఒకసారి గాడత తక్కువ ఉన్న షాంపుతో తల స్నానం చేయాలి.

ఒక కప్పు ఆవాల నూనెను తీసుకుని బాగా వేడి చేసి దాంట్లో ఉసిరి మరియు మెంతులను దంచి దాంట్లో వేయాలి.ఆ మిశ్రమంను బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి.ఆ తర్వాత ఆ మిశ్రమంను జుట్టు కుదర్లు నుండి కొసల వరకు పట్టించాలి.మాడకు కూడా ఆ నూనెను మెల్లగా మసాజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.అలా మసాజ్‌ చేసుకోవడం వల్ల చుండు సమస్యతో పాటు జట్టు ఊడిపోకుండా ఉంటుంది.

రాత్రి సమయంలో ఆ మిశ్రమంను జుట్టుకు పట్టించుకుని జట్టు ముడుచుకుని పడుకోవాలి.తెల్లరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో తల స్నానం చేయాలి.

జట్టు కొసలను ఎప్పటికప్పుడు కొద్ది పరిమాణంలో అయినా కట్‌ చేసుకుంటూ ఉండాలి.అప్పుడే ఆరోగ్యవంతమైన జుట్టు వస్తూ ఉంది.

జుట్టుకు ఎక్కువగా కలర్‌ వేసుకోవడం, రీ బాండింగ్‌ వంటి ఉత్పత్తులను వాడటం మంచిది కాదు.అవి రసాయనాలను కలిగి ఉండటం వల్ల జుట్టుకు మంచి కంటే చెడు ఎక్కువగా చేస్తాయి.

చాలా మంది బాగా వేడిగా ఉన్న నీటితో తల స్నానం చేస్తారు.అది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు.గోరు వెచ్చటి నీరు లేదా చన్నీటితో తల స్నానం చేయాలి.వేడి నీటి వల్ల జట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

కొబ్బరి నూనెలో కరివేపాకు మరియు గోరింటాకు వేసి బాగా మరగబెట్టి ఆ నూనెను నెల రోజులు ప్రయత్నించండి.అందమైన ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది.షాంపుల మరీ గాడత ఎక్కువ ఉన్నవి కాకుండా తక్కువ గాడత ఉండే షాంపులను వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube