కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ( Collection King Mohan Babu )నటుడిగా తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నారు.తన నట ప్రయాణంలో ఆయన 50వ వసంతంలోకి అడుగు పెట్టారనే సంగతి తెలిసిందే.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించగా మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నా తల్లీదండ్రుల ఆశీస్సులు, నటనలో జన్మనిచ్చిన దాసరి గారి దీవెనలు నాపై ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు( NTR, ANNR, Krishna, Shobhan Babu ) నన్ను సొంత తమ్ముడిలా భావించారని పేర్కొన్నారు.ఫ్యాన్స్ ప్రేమాభిమానాల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు.1975 మార్చి వరకు నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని భోజనం కూడా దొరక్క ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
![Telugu Annr, Career, Mohan Babu, Krishna, Mohanbabu, Artist, Shobhan Babu-Movie Telugu Annr, Career, Mohan Babu, Krishna, Mohanbabu, Artist, Shobhan Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/mohan-babu-comments-about-his-career-troubles-details-inside-goes-viral-in-social-mediac.jpg)
నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( Movie Artist Association )సభ్యులతో భోజనం చేయాలని భావించి విష్ణుని అడిగాడని మోహన్ బాబు తెలిపారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.విష్ణు చెప్పిన మాటను కచ్చితంగా నెరవేరుస్తారని మోహన్ బాబు వెల్లడించారు.
![Telugu Annr, Career, Mohan Babu, Krishna, Mohanbabu, Artist, Shobhan Babu-Movie Telugu Annr, Career, Mohan Babu, Krishna, Mohanbabu, Artist, Shobhan Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/mohan-babu-comments-about-his-career-troubles-details-inside-goes-viral-in-social-mediab.jpg)
నాకు కులమతాలతో సంబంధం లేదని అందరూ సమానమే అని ఆయన తెలిపారు.నేను ఎన్నో మంచి పనులు చేశానని వాటిని వేదికలపై చెప్పడం నాకు నచ్చదని మోహన్ బాబు పేర్కొన్నారు.నేను ఎంతోమంది పిల్లల్ని చదివించానని నా సినిమాల్లో ఎంతోమందికి అవకాశాలు కల్పించానని ఆయన పేర్కొన్నారు.
ఎవరికైనా చదువు విషయంలో ఇబ్బందులు ఎదురైతే నా యూనివర్సిటీ ఉందని మరిచిపోవద్దని మోహన్ బాబు కామెంట్లు చేశారు.కన్నప్ప చిత్రం విష్ణు కెరీర్ లో మైలురాయి కావాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు వెల్లడించారు.
కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.