జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండాలంటే ఈ పని తప్పక చేయండి!

ప్రస్తుత చలికాలంలో జలుబు దగ్గు( Cold Cough ) వంటి సీజనల్ వ్యాధులు ఎంత‌లా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.కాసేపు చల్ల గాలిలో తిరిగామంటే చాలు వెంటనే జలుబు, దాంతో పాటు దగ్గు, జ్వరం వంటివి కూడా వచ్చి ముప్పతిప్పలు పెడుతుంటాయి.

 Do This To Avoid Cold And Cough Details, Cold, Cough, Winter Health, Health Tips-TeluguStop.com

ఇందుకు కారణం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం.చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని తప్పక పెంచుకోవాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టీ చాలా బాగా సహాయపడుతుంది.

టీ తయారీ కోసం ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాయిల్ అయ్యాక కొన్ని ఎండిన మందార పూలు,( Dry Hibiscus ) వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) పావు టీ స్పూన్ పసుపు, అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) నాలుగు తులసి ఆకులు, నాలుగు పుదీనా ఆకులు వేసుకుని మరిగించాలి.దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు బాయిల్ చేస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని టీ ని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.

Telugu Cough, Tips, Healthy Tea, Hibiscusginger, Immunitybooster, Latest-Telugu

హైబిస్కస్ జింజర్ టీ( Hibiscus Ginger Tea ) చాలా రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ టీ లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ను రెట్టింపు చేస్తాయి.ప్ర‌స్తుత చ‌లికాలంలో ఇది సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

అలాగే హైబిస్కస్ జింజర్ టీ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.

Telugu Cough, Tips, Healthy Tea, Hibiscusginger, Immunitybooster, Latest-Telugu

అంతేకాకుండా ఈ టీ బరువు నిర్వహణలో సహాయపడుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.గుండె జబ్బులు, మధుమేహం మరియు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ టీ తోడ్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube