సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) శోభిత( Sobhita ) వివాహం జరగబోతున్న విషయం మనకు తెలిసిందే సమంతకు( Samantha ) విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో ఏడడుగులు నడవబోతున్నారు.
ఇక వీరి వివాహ వేదిక అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశారు.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ఆహ్వానాలు కూడా అందాయని తెలుస్తుంది.
ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి గురించి మొదటిసారి నాగార్జున( Nagarjuna ) స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నాగార్జున నాగచైతన్య శోభిత పెళ్లి గురించి మాట్లాడుతూ వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్నట్లు తెలిపారు.అయితే ఈ వివాహాన్ని చాలా సింపుల్ గా నిర్వహించబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు.ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కేవలం 400 మంది కుటుంబాలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపారు.
అందులో అత్యంత సన్నిహితులు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు ఉన్నారని నాగార్జున తెలియజేశారు.
నిజానికి నాగచైతన్య శోభితల వివాహాన్ని నాగార్జున చాలా అట్టహాసంగా చేయాలని భావించారు కానీ శోభిత నాగచైతన్య అందుకు ఒప్పుకోలేదని తెలిపారు.నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా సింపుల్గా వివాహం చేసుకోవాలని కోరడంతో వారి ఇష్ట ప్రకారమే ఏర్పాట్లు కూడా సింపుల్గానే చేస్తున్నట్లు నాగార్జున ఈ సందర్భంగా తన కొడుకు పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అయితే నాగచైతన్యకి ఇది రెండో వివాహం కావడంతో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక నాగచైతన్య సమంత పెళ్లిని మాత్రం అంగరంగ వైభవంగా చేసిన సంగతి మనకు తెలిసిందే.