న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటివరకూ సుమారు 20 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు.అన్ని దేశాలనూ ఈ మహమ్మారి ఇంకా వణికిస్తోంది.
కరోనా సోకినవారి రోగ నిరోధక వ్యవస్థ చాలా దెబ్బతింటున్నదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మానవాళిని మరింత ఆందోళనకు గురిచేసే ఒక విషయం వెలుగు చూసింది.
కరోనా నుంచి కోలుకున్న చాలామందిలో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడయ్యింది.కరోనా సోకి, హోం ఐసొలేషన్‌లో చికిత్స తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
ఈ విషయాన్ని అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్ వెల్లడించింది.పలు పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా వచ్చే సమస్యలలో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు.కరోనాకు గురైన ప్రతి 10 వేల మందిలో సుమారు 7.8 మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.

ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జియాద్ అల్ అలీ మాట్లాడుతూ కరోనా సోకి కోలుకున్న తరువాత బాధితులలో తలెత్తే కిడ్నీ సమస్యలను గుర్తించడం చాలా కష్టమన్నారు.సమస్య తీవ్రంగా మారిన అనంతరం డయాలసిస్, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అవసరమవుతాయన్నారు.తీవ్రమైన కరోనా నుంచి కోలుకున్న కొందరు బాధితులలో ఆరు నెలల తరువాత కిడ్నీ సంబంధిత సమస్యలు మొదలవుతున్నట్లు గుర్తించామన్నారు.