దంతాలను తెల్లగా మెరిపించే సింపుల్ చిట్కాలు మీకోసం!

చాలా మంది తమ దంతాలు తెల్లగా లేవని తీవ్రంగా స‌త‌మ‌తం అవుతుంటారు.ఈ క్రమంలోనే ఖరీదైన టూత్ పేస్ట్( Tooth paste ) లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Simple Tips For Teeth Whitening! Simple Tips, Teeth Whitening, Latest News, Heal-TeluguStop.com

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఎంతగానో మదన పడుతుంటారు.అయితే సహజంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ దంతాలు న్యాచురల్ గానే ముత్యాల మాదిరి తెల్లగా మెరుస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్( Charcoal powder ), హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking soda ) మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని బ్రష్ తో దంతాలకు అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.

ఆ పై వాటర్ తో శుభ్రంగా దంతాల‌ను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు కొద్దిరోజుల్లోనే తెల్లగా మెరుస్తాయి.

Telugu Tips, Latest, Oral, Simple Tips, Teeth-Telugu Health

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( turmaric ), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలు తోముకోవాలి.ఈ సింపుల్ చిట్కాను పాటించిన సరే మీ దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మారతాయి.

Telugu Tips, Latest, Oral, Simple Tips, Teeth-Telugu Health

ఇక దంతాలను తెల్లగా మార్చడానికి మరొక అద్భుతమైన చిట్కా ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( coconut oil ), నాలుగు చుక్కలు పెప్పర్మింట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.ఈ ఆయిల్ ను నోట్లో వేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి.

రెగ్యులర్ గా ఇలా ఆయిల్ పుల్లింగ్ చేస్తే దంతాలు తెల్లగా ఆరోగ్యంగా మారతాయి.చిగుళ్ల‌ నుంచి రక్తస్రావం సమస్య ఉంటే దూరం అవుతుంది.నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.నోటి నుంచి దుర్వాసన సైతం రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube