ఆధార్ కార్డు( Aadhaar card ) కలిగిన వారికి కీలక అలర్ట్.మీలో ఎవరైనా ఇంకా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకుండా దాన్ని కేవలం మూడు రోజుల్లో పూర్తి చేసుకోండి.
ఎందుకంటే, ప్రస్తుతం ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.పూర్తిగా ఉచితంగా ఈ సేవను మనం అందించుకోవచ్చు.
ఈ గడువు డిసెంబర్ 14న ముగిస్తుంది.కాబట్టి ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే మనకు సమయం ఉంది.
ఈ సేవల కోసం ఇదివరకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( Unique Identification Authority of India )ఆధార్ కార్డును ఉచితంగా చేయడానికి డిసెంబర్ 14, 2024 వరకు సమయాన్ని అందించింది.ఒకవేళ ఈ సమయంలో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేక పోతే ప్రతి ఒక్క అప్డేట్ కి 50 రూపాయల రుసుము చెల్లించాల్సి వస్తుంది.ముఖ్యంగా పది సంవత్సరాల క్రితం తీసుకున్న ఆధార్ కార్డుకు అప్డేట్ అవసరమని, అందుకోసం ఉచితంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది.10 సంవత్సరాల క్రితం పొందుపరిచిన వివరాల్లో ఏదైనా మార్పులు జరిగి ఉండవచ్చని అందుకోసమే ఆ మార్పులు చేర్పులు చేసుకోవాలన్న ఉద్దేశంతో UIDAI సదుపాయాన్ని అందించింది.మొదటగా ఈ ప్రక్రియను 2024 మార్చి 14 నుండి 2024 జూన్ 14 వరకు పొడిగించింది.అయితే ఈ సమయాన్ని మరోసారి సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది.
ఆ తర్వాత కూడా ఇంకోసారి డిసెంబర్ 14 వరకు పొడిగించింది.అయితే ఈసారి మాత్రం ఎలాంటి పొడిగింపు చర్యలు చేపట్టేలా కనబడడం లేదు.కాబట్టి ఎవరైనా ఇంకా అప్డేట్ చేసుకోకపోతే ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కారణంగా వినియోగదారులు దానినిఉపయోగించుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరైనా అప్డేట్ చేయలేదా వెంటనే ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేసి మీ విషయం సంబంధించి ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే సరైన డాక్యుమెంట్స్ పొందుపరిచి ఉచితంగా మార్పులు చేసుకోండి.