వైరల్ వీడియో: మనిషి ప్రయాణించే డ్రోన్ టాక్సీ తయారు చేసిన ఇంటర్ విద్యార్థి

ప్రస్తుత కాలంలో రోజుకొక టెక్నాలజీ( Technology ) పుట్టుక వస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆవిష్కరణలు ఆవిష్కృతమవుతున్నాయి.

 Viral Video Of Inter Student Making Man-flying Drone Taxi, The Drone Taxi ,man T-TeluguStop.com

తెలివి ఎవడబ్బ సొత్తు కాదని, తాము అనుకునేది సాధించేంతవరకు పోరాడుతూనే ఉన్నారు ప్రస్తుతం చాలామంది.ఇందులో భాగంగానే తాజాగా భారత దేశంలోని ఓ ఇంటర్ విద్యార్థి( An inter student ) అద్భుతాన్ని సృష్టించాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్రంలోని ఓ ఇంటర్ విద్యార్థి అద్భుతం సృష్టించాడు.రాష్ట్రానికి చెందిన గ్వాలియర్ ప్రాంతంలోని మేధాన్ష్ త్రివేది ( Medhansh Trivedi )ఐదు సంవత్సరాల పాటు శ్రమించి మనుషుల ప్రయాణించే డ్రోన్ టాక్సీని తయారు చేశాడు.ఈ డ్రోన్ కు MLDT 01 అని నామకరణం కూడా చేశారు.

ఈ డ్రోన్ ను ఉపయోగించి 80 కేజీల బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాలిలో తీసుక వెళ్ళగలదు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ డ్రోన్ ను తయారు చేసేందుకు మూడు నెలలపాటు పూర్తి సమయం వెచ్చించానని, అలాగే మూడు లక్షల కు పైగా ఖర్చుపెట్టి ఈ డ్రోన్ సృష్టించినట్లు త్రివేది మేధాన్ష్ తెలిపాడు.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

భారతదేశంలో ఇలాంటి వ్యక్తులకు కొదవలేదని అయితే.సరైన మార్గం లో ప్రయాణిస్తే ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తుందని కొందరు కామెంట్ చేస్తుండగా.భలే డ్రోన్ తయారు చేశావంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ కొత్త రకం డ్రోన్ ను మీరు కూడా చూసి మీకేమనిపిచ్చిందో ఒక కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube