తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి( Mohan Babu ) చాలా మంచి గుర్తింపు అయితే ఉండేది.ఆయన ఒకప్పుడు విలక్షణమైన నటనతో సినిమాలను చేయడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
అయితే హీరోగా చేసిన సినిమాల్లో ఆయనకు పెద్దగా గుర్తింపును తీసుకురానప్పటికీ నటుడిగా మాత్రం ఆయన చాలా మంచి ఉన్నతమైన పొజిషన్ కు ఎదిగాడనే చెప్పాలి.మరి అలాంటి మోహన్ బాబు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్( Family Problems ) వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

ఆయన ఏం చేసినా కూడా కొన్ని రోజుల నుంచి వివాదాల బారిన పడుతున్నాడు.వాళ్ల కొడుకుల విషయంలో( Mohan Babu Sons ) ఆస్తుల పరంగా ఆయన కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం అనేది కూడా చాలా వరకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.ఇక మీడియా మీద దాడి చేస్తే ఆయనకు ఏమోస్తుంది అంటూ జర్నలిస్టుల సంఘాలు సైతం అతన్ని విమర్శిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మోహన్ బాబుకి చాలా బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి.

ఇక ఇలాంటి సందర్భంలో కామ్ గా ఉండాలి తప్ప ఎలాంటి వైఖరిని పాటించిన కూడా విమర్శలు ఎదుర్కొక తప్పదు.మరి తన కొడుకులు తనతో పాటు కాంప్రమైజ్ అయి అంతా కలిసిపోతారా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇప్పటికే రజినీకాంత్( Rajinikanth ) సైతం ఫోన్ చేసి మోహన్ బాబుని పరామర్శించినట్టుగా తెలుస్తోంది.ఇక దాంతో మోహన్ బాబు కొంతవరకు ఎమోషన్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…మరి ఈ సందర్భంలో మోహన్ బాబు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు.
మరి ఈ ప్రాబ్లం నుంచి ఆయన బయటికి రావాలంటే మరి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంది…
.