నాలుగేళ్ల క్రితం కరోనా వైరస్( Corona virus ) వల్ల ఎన్నో కుటుంబాలలో విషాదాలు చోటు చేసుకున్న పరిస్థితి తెలిసిందే.చైనాలో హెచ్ఎంపీవీ కేసులు( HMPV cases in China ) నమోదవుతున్న తరుణంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు, అహ్మదాబాద్ లో ఒక చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
ఈ మూడు కేసులలో ఒక చిన్నారి కోలుకుని డిశ్చార్జ్ అయిందని మిగతా ఇద్దరు చిన్నారులకు చికిత్స అందుతోందని సమాచారం.
ఎలాంటి ప్రయాణాలు చేయని కుటుంబాలలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ లాంటి లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయని తెలుస్తోంది.
ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు, ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే వైరస్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని సమాచారం అందుతోంది.దేశ ఆరోగ్య శాఖ ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎంపీవీ పరీక్షలు( HmPV tests ) చేస్తోందని సమాచారం అందుతోంది.ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది.
ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
బయట ప్రదేశాల్లో సంచరించే సమయంలో క్వాలిటీ మాస్క్ లను ధరించాలి.ఇంట్లో వేడినీటిని చల్లార్చి తాగాలి.ఏ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
సబ్బుతో 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి.ఇతరులకు సంబంధించిన వస్తువులను ఉపయోగించే సమయంలో జాగ్రత్త వహించాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.