ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే నట్స్ లో బాదం పప్పు( Almonds ) ఒకటి.బాదం పప్పులో పోషకాలు మెండుగా ఉంటాయి.
నిత్యం నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే సత్తా కూడా బాదం పప్పుకు ఉంది.
ముఖ్యంగా నాలుగు బాదం పప్పులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే మేకప్ లేకపోయినా సరే మీరు సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవడం ఖాయం.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు బాదం పప్పులు మరియు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి తొక్క తొలగించిన బాదం పప్పులు మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), చిటికెడు పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ మాస్క్ వేసుకోవడం వల్ల అద్భుతాలు లాభాలను పొందుతారు.ఈ మాస్క్ చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను పూర్తిగా రిమూవ్ చేస్తుంది.
చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.చర్మంపై ఏమైనా మొండి మచ్చలు ఉంటే క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
కాబట్టి మేకప్ లేకపోయినా సూపర్ గ్లోయింగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.