ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి.ఎగ్టిట్ పోల్స్, ముందస్తు అంచనాలను తలక్రిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )అగ్రరాజ్య అధినేతగా ఘన విజయం సాధించారు.
తొలుత ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన కమలా హారిస్( Kamala Harris ) .తర్వాత చప్పబడిపోయారు.కీలక రాష్ట్రాలు సహా స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ప్రభంజనం సృష్టించారు.మెజారిటీ అమెరికన్లు ఆయన వెంట నడటవటంతో కమలా హారిస్‌కు ఓటమి తప్పలేదు.
ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించారు కమలా హారిస్.వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీ( Howard University in Washington DC ) వేదికగా డెమొక్రాట్లు, తన మద్ధతుదారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని, ఓటమిని మనం ఆశించలేదని.కానీ దీనిని అంగీకరించాల్సిందేనని కమల అన్నారు.ఫ్రీడమ్, జస్టిస్, అవకాశాలు, రెస్పెక్ట్ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.ఇక ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు కమలా హారిస్ తన మద్ధతుదారులకు తెలియజేశారు.
అధికార మార్పిడి శాంతియుతంగా జరిగేందుకు తన వంతు సాయం చేస్తామని చెప్పినట్లు కమలా హారిస్ అన్నారు.
డెమొక్రాటిక్ పార్టీలో సమన్వయ లోపంతో పాటు బైడెన్ ( Biden )ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా నిర్ణయాలన్నింటిలో కమలా హారిస్ భాగస్వామ్యం ఉండటం ఆమెకు చేటు చేసింది.రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో బైడెన్ తీరు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి.వీటన్నింటికీ తోడు బైడెన్ – హారిస్ హయాంలో అక్రమ వలసలు అమెరికా సమాజాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
వీరి వల్ల హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు వంటివి పెరిగిపోవడంతో సగటు అమెరికా వాసి విసిగిపోయాడు.ఈ పరిణామాలు బైడెన్ యంత్రాంగంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమై , ట్రంప్ విజయానికి బాటలు వేశాయి.