ప్రస్తుత ఊరుకు పరగు జీవితాలలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వారి జీవన ఉపాధి కోసం అనేక రకాల ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులను సంపాదించుకొని వారి కుటుంబాన్ని పోషిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.ఇలా కొంతమంది ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ( Jobs in leading companies )చేస్తున్నవారు.
ఏదైనా అత్యవసర విస్థితి ఎదురై సెలవు కావాలన్నా కానీ, ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వెళ్లాలన్నా కానీ వారి బాస్ అనుమతి తప్పనిసరిగా కావాలి.ఒకవేళ సెలవు కావాలంటే సదరు టీం లీడర్ కి విషయం తెలియజేసి ఎంతో వినయంగా కారణాలు వివరించి మరి మెసేజ్ కానీ.
మెయిల్ కానీ చేయాల్సిందే.

కానీ, తాజాగా ఒక ఉద్యోగి తక్కువ పదాలతో రాసిన సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ షా( Siddhartha Shah ) అనే వ్యక్తి ఒక పోస్ట్ చేశారు.తన టీం సభ్యుడు సెలవు కోరుతూ పంపిన మెయిల్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
అందులో హాయ్ సిద్ధార్థ్.నవంబర్ 8న సెలవు తీసుకుంటా బాయ్ అని రాసి ఉండడం చూసి సోషల్ మీడియా వినియోదారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

క్లుప్తంగా, సూటిగా, అనుమతి కోరుతూ మూడు ముక్కలలో విషయాన్ని తెలియచేసినా ఆ వ్యక్తి తీరు చూసి నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.మరికొందరు అయితే ఆ వ్యక్తి సెలవు కోసం అనుమతి తీసుకోకుండా డైరెక్ట్ గా లీవ్ తీసుకుంటున్నట్లు తెలియజేసిన విధానాన్ని పొగుడుతూ ఉన్నారు.ఇక మరికొందరైతే ఈ తరం యువతి యువతులకు ఎటువంటి క్రమశిక్షణ లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.







