అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.కౌన్సిలర్లుగా, మేయర్లుగా, సెనేటర్లుగా , ప్రతినిధుల సభ సభ్యులుగా, మంత్రులుగా, ఏకంగా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన సత్తా మనది.
అంతేకాదు.ఎన్నికల్లో గెలుపొటములను ప్రభావితం చేసే స్థాయిలో భారతీయులు ఉన్నారు.
ఈసారి కమలా హారిస్ ( Kamala Harris )స్వయంగా అధ్యక్ష బరిలో నిలవడంతో అందరి చూపు ఆమెపైనే నిలిచింది.
నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలతో పాటు సెనేట్, ప్రతినిధుల సభ , రాష్ట్రాల చట్ట సభలు, లోకల్ బాడీలకు కూడా ఎన్నికలు జరిగాయి.
వీటిలో పలువురు భారతీయులు జయకేతనం ఎగురవేశారు.అన్నింటికి మించి ఈసారి అమెరికా ప్రతినిధుల సభలో భారతీయుల బలం 6కి పెరిగింది.ఇప్పటి వరకు శ్రీథానేదర్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమీబేరా, ప్రమీలా జయపాల్ ( Srithanedar, Raja Krishnamurthy, Ro Khanna, Dr.Amibera, Pramila Jayapal )ఉండగా.తాజాగా న్యాయవాది, భారత సంతతికి చెందిన సహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా 10వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు.అంతేకాదు.అమెరికా తూర్పు తీర ప్రాంతం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా సుహాస్ చరిత్ర సృష్టించారు.
ఇక కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి అమీబేరా ఏడోసారి, ఇల్లినాయిస్( Amoebara 7th, Illinois ) 8వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి వరుసగా ఐదోసారి, వాషింగ్టన్‌లోని 7వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్, కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా, మిచిగన్‌లోని 13వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీథానేదర్ వరుసగా రెండోసారి గెలపొందారు.మరో భారత సంతతి నేత అమిష్ షా అరిజోనాలోని ఫస్ట్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు.అయితే ఆయన గెలిచారా? ఓడారా? అన్నది తేలాల్సి ఉంది.
ఆరుగురు భారత సంతతి ఎంపీలు విజయం సాధించడంతో యూఎస్ కాంగ్రెస్‌లో సమోసా కాకస్ సైజు పెరిగింది.భారతీయ వంటకమైన సమోసాకు ప్రపంచవ్యాప్తంగా వున్న ఆదరణ కారణంగా.ఈ వర్గానికి అమెరికాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.అమెరికా పార్లమెంట్‌కు ఎన్నికైన సమయంలో రాజా కృష్ణమూర్తి తన ప్రసంగంలో ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు.నాటి నుంచి యూఎస్ కాంగ్రెస్ లోపల భారత సంతతికి చెందిన ఎంపీల గ్రూప్‌ను సమోసా కాకస్‌గా వ్యహరిస్తున్నారు.