కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.కథలు ఎంపిక తో ప్రేక్షకులను మెప్పించిన కార్తీ తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నాడు.కార్తీ సినిమా వస్తుందంటే ఎదురు చూసే అభిమానులు తెలుగులో కూడా చాలామంది ఉన్నారు.
ఇప్పుడు వరకు కార్తీ నటించిన సినిమాల టైటిల్స్ అటు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ కావడం గమనార్హం.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కాష్మోరా : కార్తీ, నయనతార కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కాష్మోరా.అయితే ఇదే టైటిల్ తో 1986లో రాజేంద్రప్రసాద్ భానుప్రియ జంటగా ఓ సినిమా వచ్చింది.
చినబాబు : కార్తీ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చినబాబు.రైతు గొప్పతనం గురించి ఈ సినిమాలో చెబుతాడు.కాగా అయితే 1988లో నాగార్జున అమల జంటగా చిన్న బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఖైదీ : చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్ గా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చి అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా టైటిల్ ను తన సినిమాకు రిపీట్ చేశాడు కార్తీ.
దొంగ : మెగాస్టార్ చిరంజీవి ఇదే టైటిల్ తో ఓ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.2019 కార్తి ఇది టైటిల్ ను వాడుకొని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఖాకి : ఈ టైటిల్ తో గతంలో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి.ఇక 2018లో కార్తీక్ ఇదే టైటిల్ తో తన సినిమాను తెలుగులో డబ్ చేశాడు.
సుల్తాన్ : శరత్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా సుల్తాన్.కార్తీ ఇదే టైటిల్ తో తన సినిమాని తెలుగులో డబ్ చేయడం గమనార్హం.
సర్దార్ : సీనియర్ ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్స్ అనుకరించే విధంగా కార్తి సర్దార్ సినిమా టైటిల్ ఉందని చెప్పాలి.వీటితోపాటు మల్లిగాడు, దేవ్ లాంటి తెలుగు సినిమా టైటిల్ ని కూడా కార్తీ తన సినిమాలకు పెట్టుకోవడం గమనార్హం.