విద్యార్ధులు, పర్యాటకులు , విదేశీ కార్మికులు సహా 2024లో దాదాపు 2.3 మిలియన్లకు( 2.3 million ) పైగా విదేశీ దరఖాస్తులను కెనడా ప్రభుత్వం తిరస్కరించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.తిరస్కరణ రేట్లు 2023లో 35 శాతం ఉండగా, అది గతేడాది 50 శాతానికి పైగా పెరగడంతో వలసల నిర్వహణలో గణనీయమైన మార్పులను సూచిస్తున్నాయి.
కెనడియన్ దినపత్రిక టొరంటో స్టార్ నివేదించిన డేటా ప్రకారం.ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) 2024లో 2,359,157 తాత్కాలిక నివాస దరఖాస్తులను తిరస్కరించింది.ఈ సంఖ్య 2023లో 1,846,180గా ఉంది.
2024లో 1.95 మిలియన్ల కంటే తక్కువ సందర్శకుల వీసా దరఖాస్తులు( Visa applications ) తిరస్కరించబడ్డాయి.ఇది 2023లో 40 శాతంగా ఉంది.
అలాగే స్టడీ పర్మిట్ తిరస్కరణలు 52 శాతానికి పెరగ్గా.వర్క్ పర్మిట్ తిరస్కరణలు 22 శాతం ఉన్నాయి.
ఇవి 2023లో 23 శాతంగా ఉంది.గృహాల కొరత, పెరుగుతున్న జీవన వ్యయంపై ప్రజల ఆందోళనల నేపథ్యంలో తాత్కాలిక వలసలను తగ్గించాలని ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ గణాంకాలు నమోదయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి ప్రతిస్పందనగా కెనడా రాబోయే మూడేళ్లలో తన శాశ్వత నివాస లక్ష్యాలను తగ్గించింది.ఈ పరిమితి 2025లో 3,95,000కు తగ్గుతుంది.2026లో 3,80,000కు.2027లో 3,65,000కు తగ్గుతుంది.అలాగే తాత్కాలిక నివాస పర్మిట్‌పై ఉన్న వారిని.వారి గడువు ముగిసిన తర్వాత వెళ్లిపోవాలని ప్రోత్సహించడం ప్రారంభించింది.అయితే వీరిలో శాశ్వత హోదాకు మారడానికి అర్హత ఉన్న వారి కోసం కొన్ని మార్గాలను తెరిచి ఉంచింది.

ఇదే సమయంలో ఐఆర్‌సీసీ ప్రాసెసింగ్ ( IRCC processing )సమయాలు కొంత మెరుగుపడ్డాయి.మార్చి 2025లో బ్యాక్‌లాగ్ ఫైళ్ల సంఖ్య 8,21,200గా ఉండగా.జనవరిలో 8,92,100 గా ఉంది.
బ్యాక్‌లాగ్‌ల సంఖ్య 1 మిలియన్ మార్క్ కంటే తక్కువగా ఉండటం ఇది వరుసగా మూడవ నెల.ఫిబ్రవరి చివరి నాటికి ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధలో 2,029,400 దరఖాస్తులు ఉన్నాయి.వీటిలో 1,208,200 దరఖాస్తులు ఐఆర్‌సీసీ ప్రాసెస్ చేసింది.