ముఖ్యంగా చెప్పాలంటే ఉగాది పచ్చడి( Ugadi Pachadi ) ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తారు.కానీ ఎక్కడి వారైనా సరే అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులను తప్పకుండా ఉండేలా చూసుకుంటారు.
ఈ పచ్చడి కోసం చెరుకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, జిలకర్ర, మిరపకాయ వంటివి ఉపయోగిస్తారు.ఇన్ని కలిపి చేసినా ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధమని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుంచి శ్రీరామనవమి వరకు లేదా క్షేత్ర పౌర్ణమి వరకు ప్రతి రోజు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని పెద్దవారు చెబుతున్నారు.

అలాగే ఆ సంవత్సరమంతా రోగాలు రావని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడి నీ నింబ కుసుమ భక్షణం పిలుస్తారు.ఋతువులలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుంచి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది.
పచ్చడిలో ఉండే వేప పువ్వు( Neem Flower ) కడుపులో ఉన్న నూలి పురుగులను చంపేస్తుంది.విషగాలి ఆటలమ్మ, అమ్మోరు లాంటి అంటు రోగాలను దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది.
మామిడి( Mango ) యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది.అలాగే మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతాయి.
బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

చింతపండు( Tamarind ) మలబద్ధకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది.ఉప్పు ఎండాకాలంలో వచ్చే డిహైడ్రేషన్ ను దూరం చేస్తుంది.అలాగే సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని సందేశాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బెల్లం తీపి అనేది సంతోషానికి, ఉప్పుజీవితంలో ఉత్సాహానికి, వేప పువ్వు చేదు బాధ తాలూకు అనుభవాలకు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితిలకు, పచ్చి మామిడి ముక్కల పులుపు కొత్త సవాళ్లకు, కారం సహనం కోల్పోయినట్టు చేసే పరిస్థితులకు సంకేతం అని పెద్దవారు చెబుతున్నారు.