తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు దేశ నలుమూలల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి వెళుతూ ఉంటారు.మార్గశిర మాసం హేమంత రుతువులు వచ్చే మొదటి నెల.
మార్గశిర మాసం విష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం.అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశికి వచ్చిన రోజుని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.
అంతేకాకుండా ఈరోజున విష్ణు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడని అందుకే ఆ రోజున ముక్కోటి ఏకాదశి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.సంవత్సరంలో వచ్చే ఏకాదశిలలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించేపర్వంగా భక్తులు విశ్వసిస్తారు.
మన తెలుగు ప్రజలు ఈ పండుగను ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు.తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఈ మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు.
కొత్త సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి రెండవ తేదీన వచ్చింది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దేవాలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వచ్చే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాటులను చేస్తున్నారు.
దీనివల్ల శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ కొటాను డిసెంబర్ 24 ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే అవకాశం ఉంది.రోజుకు 25 వేల చొప్పున 10 రోజులకు గాను 2.5 లక్షల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసే అవకాశం ఉంది.భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా తిరుపల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.