నెల్లూరు కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నాలుగేళ్లుగా తన నియోజకవర్గంలో పనులు కావడం లేదన్నారు.సమస్యల పరిష్కారానికి ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు.
ప్రజల కోసం ఎందాకైనా పోరాడతానని పేర్కొన్నారు.తన మాటలను రాజకీయ కోణంలో చూడొద్దని తెలిపారు.
ఇసుక కాంట్రాక్టర్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.ఇసుక లారీను అధికారులు అడ్డుకోవడం లేదన్న ఆయన ఫైనాన్స్ సెక్రటరీ రావత్ తీరు సరిగా లేదని ఆరోపించారు.
సీఎం ఆమోదం తెలిపిన పనులకూ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదని ప్రశ్నించారు.రావత్ చాలామంది ఎమ్మెల్యేలను చూసుండొచ్చు.
ప్రజల పక్షాన పోరాడే తనలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోటంరెడ్డి స్పష్టం చేశారు.







