జాగ్రత్త... చక్కెరను అతిగా వాడుతున్నారా? ఈ సమస్య రావచ్చు!

చాలామందికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం.ఉదయం తీసుకునే టీ నుండి చక్కెరను బాగా తీసుకుంటాం .

 Are You Using Too Much Sugar Be Careful, Sugar, Health, Immunity, Cancer-TeluguStop.com

ఏదైనా శుభకార్యాలలో ముందుగా తీపి పదార్ధాలనే ఎక్కువగా వాడుతుంటాం.బెల్లం కంటే చక్కెర ఎక్కువ వాడుకలో ఉంటుంది.

కానీ చక్కెర అతిగా తినడం వల్ల ప్రాణానికి ముప్పు ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

చక్కెరను అతిగా తినడం వల్ల షుగర్ వంటి సమస్యలే కాకుండా మరో ప్రాణాంతకమైన సమస్య ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

చక్కెరలు ఎక్కువగా తినడం వల్ల అది శరీరంలోకి చేరి చక్కెర పదార్థం ఒకటే చోట పులిసిపోతుందని తెలుపగా పులిసిన చక్కెర భాగం శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు ఆ చక్కెరను తీసుకొని మరింత శక్తిని పెంచుకుంటుంది.దీంతో ఈ శక్తి వల్ల కేన్సర్ కణాలు శరీరంలో ఉన్న అన్ని అవయవాలపై ప్రభావం చూపుతూ ప్రాణాల మీదకు దారితీస్తాయని బెల్జియం శాస్త్రవేత్తలు దాదాపు 9 సంవత్సరాల పాటు పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు.

చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల ఇంత పెద్ద సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కూడా ఊహించలేకపోయారు.కాబట్టి చక్కెరను ఎంత తక్కువగా వాడితే అంత శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.బయట దొరికే స్వీట్స్ లో ఎక్కువ చక్కెరను వాడుతుంటారు.చాలా వరకు తీపిని ఇష్టపడే వాళ్ళు చక్కెరకు బదులు బెల్లం తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ శాతం పెరగడమే కాకుండా శరీరానికి మంచి మేలు చేస్తుందని తెలిపారు.కాబట్టి చక్కెరను వీలైనంత వరకు తక్కువ వాడుకలో ఉండేటట్లు చూసుకోవాలి.

చక్కెర వల్ల షుగర్ శాతం పెరగడమే కాకుండా, కేన్సర్ వ్యాధికి దారితీస్తాయని… ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఇతర మార్గాలు లేవని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube