షుగర్ వ్యాధి(మధుమేహం).ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.ఈ సైలెంట్ కిల్లర్ ఒక్క సారి ఎటాక్ చేసిందంటే.దీర్ఘకాలంగా వేధిస్తూనే ఉంటుంది.ఇక పొరపాటున షుగర్ విషయంలో నిర్లక్ష్యం చేశామో.ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది.
ముఖ్యంగా హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు ఏం తినాలన్నా తెగ భయపడిపోతుంటారు.
ఈ నేపథ్యంలో తెలిసో, తెలియకో ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మంచి ఆహారాలను కూడా దూరంగా చేసుకుంటారు.
అలాంటి వాటిలో బాదం పప్పు ఒకటి.సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కొందరు బాదం పప్పును తినకూడదని భావించి.వాటిని దూరం పెట్టేస్తుంటారు.
కానీ, ఇలా అనుకోవడం చాలా పొరపాటు.బాదం పప్పులో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం,జింక్, ఫాస్పరస్, సోడియం వంటి ఖనిజాలతో పాటు ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ బి ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే బాదం పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో జబ్బులను నివారిస్తుంది.
ఇక షుగర్ వ్యాధి గ్రస్తులు బాదం పప్పు తినకూడదు అన్నది కేవలం అపోహ మాత్రమే.భోజనం చేసిన తర్వాత ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రతి రోజూ నానబెట్టిన బాదం పప్పులను నాలుగైదు చప్పున ఉదయాన్నే లేదా సాయంత్రం వేళ తీసుకుంటే.ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది.
అలాగే బాదం పప్పులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాన్స్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సహజంగానే కంట్రోల్‌లో ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.ఫలితంగా షుగర్ వ్యాధి అదుపు తప్పకుండా ఉంటుంది.పైగా బాదం పప్పులను డైట్‌లో చేర్చుకుంటే.వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.మరియు మెదడు కూడా షార్ప్‌గా పని చేస్తుంది.