టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.తెలుగులో రకుల్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు లేకపోయినా ఇతర భాషల్లో మాత్రం అఫర్లు భారీ స్థాయిలోనే ఉన్నాయి.
మేకప్ వేసిందుకు, డ్రెస్ కు తగినట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఒక టీమ్ పని చేస్తూ ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
రెడ్ కార్పెట్ పై( Red Carpet ) మేము అందంగా కనిపించేందుకు వీళ్లు సహాయపడతారని కేవలం ఒక్క లుక్ కోసం 20,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటారని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
స్టైలిస్ట్ కు, మేకప్ టీమ్ కు, ఫోటోగ్రాఫర్ కు ఇలా అందరికీ డబ్బు చెల్లించాల్సి ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.నేను ఆరు సంవత్సరాలుగా ఒక మేకప్ హెయిర్ టీమ్ తో కలిసి పని చేస్తున్నానని తెలిపారు.

వారు నాకు కుటుంబ సభ్యుల్లాగే కనిపిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.ఈవెంట్ల కోసం డిజైనర్లు మాకు ఉచితంగానే దుస్తులు పంపిస్తారని దీని వల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అనుకుంటారని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ అది నిజం కాదని ఆమె తెలిపారు.వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చిన వారికి ఆ డ్రెస్ కు తగిన విధంగా మమ్మల్ని అందంగా రెడీ చేసే స్టైలిష్ట్ లకు( Stylists ) డబ్బులు ఇవ్వాలని రకుల్ చెప్పుకొచ్చారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కొరియర్ ఛార్జీలు సైతం అందుకు జత చేస్తారని ఆమె పేర్కొన్నారు.అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.డిజైనర్లు మాకు డ్రెస్ లు ఇవ్వాలని తహతహలాడుతారని మేము వాటిని ధరించిన సమయంలో అటెన్షన్ వస్తుందని రకుల్ వెల్లడించారు.