సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీని కారణంగా జుట్టు రోజు రోజుకు పల్చగా మారిపోతుంటుంది.
ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు.తోచిన చిట్కాలను పాటిస్తుంటారు.
ఖరీదైన జుట్టు ఉత్పత్తులను వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను కనుక వారానికి రెండు సార్లు వాడారంటే వద్దన్నా కూడా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేసే ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు( Dry Amala ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్, అర కప్పు ఎండిన కరివేపాకు వేసుకొని చిన్న మంటపై నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు( Black Sesame Seeds ) వేసి మరో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ఒక బాటిల్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.ఇక నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే అద్భుత ఫలితాలను పొందుతారు.ఈ ఆయిల్ జుట్టు పెరుగుదల( Hair Growth )ను చక్కగా ప్రోత్సహిస్తుంది.జుట్టు ఎంత పల్చగా ఉన్నా కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.కుదుళ్లు బలంగా మారతాయి.
జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.ఫైనల్ గా ఈ ఆయిల్ ద్వారా ఆరోగ్యమైన ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి.