ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనకు తొమ్మిదో సారి నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.గత ఐదు నెలలుగా ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే.
అయితే వివిధ కారణాలతో కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే.గతంలో ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ నెల 12 తరువాత విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈడీ తొమ్మిదో సారి నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరవుతారా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







