సినిమా కి సంగీతం ప్రాణం.సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ కి వచ్చే సరికి చాల మంది సంగీత దర్శకులు ఉన్నప్పటికి మహిళా సంగీత దర్శకులు మాత్రం చాల తక్కువగానే ఉన్నారు.
అలాంటి వారిలో ప్రస్తుతం ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఆమె మరెవరో కాదు బిందు మాలిని( Bindu Malini ).ఈ బిందు ఎవరు ? సినిమాలకు ఈమెకు ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అరువి( Aruvi ) అనే ఒక సినిమా 2016 లో విడుదల అయింది.
ఇందులో ప్రధాన పాత్రలో నటించింది అదితి బాలన్.
ఈ సినిమా విడుదల అయ్యాక రజినీకాంత్( Rajinikanth ) సైతం ఫోన్ చేసి సినిమా అద్భుతంగా చేస్తావ్ అంటూ హీరోయిన్ ని పొగిడారట.అయితే ఈ సినిమాకు కేవలం తమిళ్ లోనే కాదు మిగతా అన్ని బాషల వారు కూడా వెతుక్కొని చూసారు.ఇక ఈ చిత్రం తర్వాత కన్నడ లో వచ్చిన మరొక చిత్రం నాతిచరామి.
ఈ చిత్రం మంచి విజయం సాధించడం తో పాటు ఒక సినిమాకు ఎక్కువ జాతీయ అవార్డ్స్ ( National Awards )అందుకున్న సినిమా గా కూడా నిలిచింది.ఈ రెండు సినిమాలకు సంగీతం అందించింది ఒక మహిళా.
ఆమె పేరు బిందు మాధవి.చెన్నై లో పుట్టి పెరిగిన బిందు మాధవి సంగీత విద్వాంసుల ఇంట్లో జన్మించింది.
చిన్నప్పటి నుంచి హిందూస్థానీ సంగీతం పై పట్టు సాధించిన బిందు 99 ఏళ్ళ ఉస్తాద్ రషీద్ ఖాన్( Ustad Rashid Khan ) దగ్గర కూడా సంగీతం నేర్చుకున్నారు.ఇక్కడే ఆమె జీవితంలో ఒక పెద్ద టర్న్ తీసిఉంది.
బిందు మాదవి అమ్మ, అమ్మమ్మ అందరు కూడా సంగీతంలో మంచి పట్టు ఉన్నవారే.అరువి చిత్రంలో పాటలు అన్ని కూడా బిందు ఆలపించినవే.ఈ చిత్రం తర్వాత హరికథా ప్రసంగ అనే కన్నడ సినిమాకు నేపధ్య సంగీతం ఇచ్చారు.ఆ తర్వాత నాతిచరామి సినిమాకు పని చేయగా ఇందులో ఐదు పాటలను సైతం ఆమెనే పాడారు.
ఈ సినిమాలోని ఒక పాటకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సింగర్ జాతీయ అవార్డు అందుకోవడం ఇదే మొదటి సారి.
అంతే కాదు అదే పాటకు ఫిలిం ఫేర్ కూడా దక్కింది.బిందు మాధవి ని ఆదర్శంగా తీసుకొని మన సౌత్ నుంచి మరికొంత మంది మహిళా సంగీత దర్శకురాలు బయటకు రావాలి కోరుకుందాం.