Pavitra Lokesh: పీహెచ్‌డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన పవిత్రా లోకేష్.. ఆమె ఎంత తెలివైన విద్యార్థినో తెలిస్తే..!

ప్రముఖ కన్నడ నటి పవిత్రా లోకేశ్( Pavitra lokesh ) తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఈ ముద్దుగుమ్మ 1979లో జన్మించింది.1994లో తన నటన జీవితాన్ని ప్రారంభించింది.ఆమె కన్నడ, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది.

 Actress Pavitra Lokesh Passed Phd Common Entrance Exam-TeluguStop.com

తల్లిగా, వదినగా, అక్కగా, ఇంకా రకరకాల పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఆమె 2007 లో సుచేంద్ర ప్రసాద్‌ను( Suchendra Prasad ) వివాహం చేసుకుంది.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.

కొన్నేళ్ళకు పవిత్ర నరేష్‌తో( Naresh ) ప్రేమలో పడింది.వారు ప్రస్తుతం కలిసి నివసిస్తున్నారు.

పవిత్ర కేవలం ఒక నటి మాత్రమే కాదు ఒక విద్యావంతురాలు కూడా.ఆమె మైసూరులోని మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ( Bachelors Degree ) పొందింది.

తరువాత సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయింది, కాకపోతే ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యింది.తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతో ఆమె యాక్టింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది.

ఆపై బెంగళూరుకి వచ్చి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది.

Telugu Naresh, Actresspavitra, Kannada, Pavitra Lokesh, Phdcommon, Tollywood-Mov

అలా ఆమె చదువుకు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.అయితే ప్రస్తుతం 44 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఈ తార చదువుపై తన ప్రేమను చంపుకోలేదు.ఇటీవల పీహెచ్‌డీ( PhD ) చేయాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి కన్నడ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది.

దీని ఫలితాలు తాజాగా విడుదల కాగా అందులో ఆమె ఉత్తీర్ణత సాధించింది.మొత్తం 981 మంది ఈ ఎంట్రన్స్ పరీక్ష రాయిగా వారిలో 259 మంది మాత్రమే పాసయ్యారు.

Telugu Naresh, Actresspavitra, Kannada, Pavitra Lokesh, Phdcommon, Tollywood-Mov

అంత కఠినమైన పరీక్షలో పవిత్ర పాస్ కావడం చూస్తుంటే ఆమె ఎంత మెరిట్ స్టూడెంటో అర్థమవుతోంది.ఈ పరీక్షలో పాసైన ఆమె త్వరలోనే బెల్గాం ఎక్స్‌టెన్షన్ సెంటర్‌లో రీసెర్చ్ చేయనుంది.మొత్తం మీద పవిత్ర ఒక శక్తివంతమైన మహిళ అని నిరూపించుకుంది.వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు.లేటు వయసులోనూ వాటిని నెరవేర్చుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube