ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజల నోట కరోనా మాటే వినిపిస్తోంది.ఫస్ట్ వేవ్‌లో దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన ఈ మహమ్మారి.
సెకెండ్ వేవ్‌లో మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.ఈ కరోనా కాలంలో ఎవర్ని చూసినా, దేన్ని తాకాలాన్నా అనుమానం.
జలుబు, దగ్గు ఉన్న వారు కంట పడితే ఆమడ దూరం పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక ఇటీవల తాము కలిసిన వారికి కరోనా సోకితే.
అప్పుడు పుట్టే భయం అంతా ఇంతా కాదు.వాళ్లని కలిశాము.
తమకు కూడా కరోనా వచ్చేస్తుందని తెగ టెన్షన్ పడి పోతుంటారు.
అయితే టెన్షన్ పడకుండా.
అలాంటప్పుడు ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మీరు రీసెంట్‌గా కలిసిన వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్టయితే.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోమ్ క్వారంటైన్ అయ్యిపోవాలి.మాస్క్ ధరించాలి.
శానిటైజర్ వాడాలి.ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులతో కలవడం, దగ్గరగా వెళ్లి మాట్లడం చేయకుండా ఒక రూమ్‌లోనే ఒంటరిగా ఉండాలి.
కరోనా సోకిన వాళ్లని కలిసిన రోజు వేసుకున్న బట్టలు లేదా ఇతరితర వస్తువులను జాగ్రత్తగా శానిటైజ్ చేయడం, ఉతికి ఆరేయడం చేయాలి.
ఇక ఇలాంటి సందర్భాల్లో చాలా మంది భయపడిపోయి.ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.కానీ.
ఎలాంటి భయం, ఆందోళన, ఒత్తిడి పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.పోషకాహారం తీసుకోండి.
కొంత సేపైనా వ్యాయామం చేయండి.ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి.
అంతేకాదు, వీలైనంత త్వరగా టెస్ట్ చేయించుకోవాలి.టెస్ట్‌లో పాజిటివ్ వచ్చి.
ఎలాంటి లక్షణాలు లేకపోతే ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహా మేరకు ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.లక్షణాలు ఎక్కువగా ఉంటే హాస్పిటల్‌లో చేరాలి.
ఇక టెస్ట్‌లో నెగటివ్ వచ్చి.లక్షణాలు కనిపిస్తే రెండు వారాల పాటు క్వారంటైన్‌లోనే ఉండాలి.
లక్షణాలు లేకపోయినా ఒక వారం పాటు క్వారంటైన్‌లో ఉంటే మంచిది.